KSP Sri Vidya Educational and Welfare Society is a secular, voluntary, grass root level organization working for the uplifting of the socio economically, under privileged segments in society, by enabling them to eliminate physical and psychological barriers in their development, relied to the Poor, Education, Medical relief to Poor peoples such others relief’s included in the provision from time to time for general public utility not involving the carrying on of any activity for profit for the benefit of the people in India irrespective of Caste, Creed, Community and Religion. !
"కుశాలపురం శ్రీ విద్య ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ"(popularly known as KSP Society) ను 2010 వ సం. లో కుశాలపురం నివాసి, ప్రభుత్వ మహిళా కళాశాల ఆంగ్ల అధ్యాపకులు ఐన శ్రీ కిల్లి అప్పారావు గారి ఆధ్వర్యంలో స్థాపించబడింది. ఈ సంస్థలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుండే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది స్వచ్ఛందంగా సభ్యులు గా చేరి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది 10 వ తరగతి లోకి ప్రవేశిస్తున్న విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని మే1వ తేదీ నుండి ప్రారంభించి మే 31 వరకు విజయవంతంగా నిర్వహించబడుతాయి. ఈ నెల రోజుల శిబిరంలో వివిధ సబ్జెక్టుల్లో నిపుణుల చే నిరాటంకంగా బోధన సాగుతోంది. ప్రతీ రోజు విద్యార్థులకు అనేక మంది దాతలు, సొసైటీ సభ్యులు,మజ్జిగ,శీతల పానీయాలు, బిస్కెట్లు, వంటి వాటిని పంచి వారి దాతృత్వాన్ని చూపిస్తారు.
అంతే కాకుండా అనేక మంది పేద విద్యార్థులకు వారి ఉన్నత చదువుల కోసం ఆర్థికంగా చేయూతను ఇస్తుంది. అర్హులైన పేద విద్యార్థులకు నోటు పుస్తకాలను,సైకిళ్లను,నాలెడ్జ్ కిట్స్ ను,క్రీడాకారులు కు యూనిఫామ్ లను ,అందిoచి సంస్థ తనవంతు సామాజిక బాధ్యత ను నెరవేరుస్తుంది.
అత్యంత దుర్భర కొరొనా పరిస్తుతుల్లో కూడా సంస్థ ఆధ్వర్యంలో మాస్క్ లను,మెడికల్ కిట్స్ ను అందించి తన దాతృత్వాన్ని చాటుకుంది.🙏
గత 13 ఏళ్ల గా KSP సొసైటీ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఇటీవల "NTR జాతీయ జీవిత సాఫల్య పురస్కారాని"కి ఎంపికకావడం ఎంతో గర్వకారణం.
KSP సొసైటీ ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ.....🙏🙏🙏
ఇట్లు
సొసైటీ అధ్యక్షులు & కార్యదర్శి